శుక్రవారం 30 అక్టోబర్ 2020
Karimnagar - Sep 28, 2020 , 03:03:09

సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

 సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

కార్పొరేషన్‌: నగర ప్రజలకు సదుపాయాలు కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మేయర్‌ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని 31వ డివిజన్‌లో ఆదివారం ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ 31వ డివిజన్‌లోని శివారు ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీలకు ఇరువైపులా డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. తాగునీటి  పైపులైన్‌ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. గాయత్రీనగర్‌లోని రోడ్‌ నంబర్‌ 4లో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం కొలతలు తీసి, హద్దులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ లెక్కల స్వప్న వేణు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.