మంగళవారం 20 అక్టోబర్ 2020
Karimnagar - Sep 27, 2020 , 02:12:51

సాయుధ పోరాట యోధురాలికి నివాళి

సాయుధ పోరాట యోధురాలికి నివాళి

  • జిల్లా వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి

కరీంనగర్‌ హెల్త్‌ : నగరంలోని 19వ డివిజన్‌ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి కార్పొరేటర్‌ ఎదుల రాజశేఖర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. గంగిపల్లి సంపత్‌, మునిగంటి శ్రీను, కొలిపాక శ్రీనివాస్‌, ఎస్సీ అట్రాసిటీ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్‌, ఎల్లయ్య, దేవోజు రవీందర్‌, చారి, గడ్డం దామోదర్‌, ఆరెపల్లి సంపత్‌, మనోహర్‌, భరత్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌ హెల్త్‌: స్థానిక కలెక్టరేట్‌ రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీణ్‌ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునిగంటి కుమార్‌, పొన్నాల రాము, ఉప్పరపల్లి శ్రీనివాస్‌, ఎడపల్లి నాగరాజు, గుండారపు సంపత్‌, ఈసంపల్లి మహేశ్‌, నేరెళ్ల శ్రీనివాస్‌, కొత్తకొండ వెంకటేశ్‌, అరవింద్‌, చింటు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌: వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శమని గొల్లకుర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సంఘం నగర అధ్యక్షుడు జంగ కొమురయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్‌రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె శ్రీనివాస్‌కుర్మ, లింగన్నయాదవ్‌ పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌: రేకుర్తిలోని శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ నందెల్లి ప్రకాశ్‌, 17వ డివిజన్‌  కార్పొరేటర్‌ కోల భాగ్యలక్ష్మిప్రశాంత్‌ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు పొన్నం లక్ష్మణ్‌, మునిగంటి లింగయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌: నగరంలో రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ట్యాంక్‌ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేశ్‌, నగర అధ్యక్షుడు బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి పట్టణాధ్యక్షుడు తూడూరి రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి గంగిపల్లి సతీశ్‌ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌ రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు మునిగంటి శ్రీనివాస్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

కరీంనగర్‌ రూరల్‌: మొగ్దుంపూర్‌లో 4వ వార్డు సభ్యుడు మైలారం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి బీజేపీ ఓబీసీ మోర్చా జోనల్‌ ఇన్‌చార్జి తాళ్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ తిరుపతి, రాములు, రజక సంఘం నాయకులు కాల్వ మల్లయ్య, మొండయ్య, ఓదెలు, సంపత్‌, శివరామకృష్ణ, సంజీవ్‌, రాములు, పవన్‌, రాజు శివ, సంతోష్‌, శివ, సంతోష్‌, శ్రీనివాస్‌, ఓదెలు పాల్గొన్నారు. 


logo