గురువారం 29 అక్టోబర్ 2020
Karimnagar - Sep 26, 2020 , 02:04:48

కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలో దంచికొట్టిన వర్షం

కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలో దంచికొట్టిన వర్షం

  • చిగురుమామిడి మండలం ఇందుర్తిలో  అత్యధికంగా 104.3 మిల్లిమీటర్లు 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా దంచికొట్టింది. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 104.3 మిల్లిమీటర్ల వర్షం పడింది. చిగురుమామిడిలో 38.3, రామడుగు మండలం గుండిలో 22.3, మానకొండూర్‌ మండలం వెల్దిలో 21.5, గంగాధర మండలం బూర్గుపల్లిలో15.3, గంగాధరలో 14.3, కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌లో 12.8, చొప్పదండి ఆర్నకొండలో 10.3, తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో 10.2 మల్లిమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటున 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీఓ పూర్ణచందర్‌ తెలిపారు. ఇక పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు గంటలపాటు కుండపోత పోసింది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంతో పాటు జిల్లా అంతటా రెండు గంటల పాటు కురిసింది. దీంతో ఒక్కసారిగా జిల్లా వ్యా ప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముత్తారం మండలంలో అత్యధికంగా 34.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పాలకుర్తిలో 0.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. సగటున 8.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గోదావరిఖనిలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. రామగిరి మండలంలోని కల్వచర్లలో తాటి చెట్టుపై పిడుగుపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. సిరిసిల్ల పట్టణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి గంట పాటు కురిసిన వర్షంతో 5 మిల్లీమీటర్లు నమోదైంది. ఇల్లంతకుంటలో పంట పొలాల్లో నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వేములవాడ రాజన్న ఆలయ పరిసర వీధులు వరదనీటితో నిండిపోగా, చిరు దుకాణాల్లోకి నీరు చేరింది.