మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Sep 25, 2020 , 02:28:00

అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాలి

అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాలి

  • డీజీపీ మహేందర్‌రెడ్డి 
  •  పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

కరీంనగర్‌ క్రైం : అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్‌ నుంచి కమిషనరేట్లు, జిల్లాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ కార్యకలాపాల నియంత్రణలో టాస్క్‌ఫోర్స్‌ విభాగం చురుకైన పాత్ర పోషించాలన్నారు. చట్ట వ్యతిరేకంగా జరిగే ఏ చర్యలనూ సహించేది లేదన్నారు. నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీస్‌శాఖ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయడంతో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయనే విషయాన్ని ప్రతిస్థాయి అధికారి గుర్తించాలన్నారు. సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ నేర రహిత కమిషనరేట్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇటీవల అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం కమిషనరేట్‌ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. ఇక్కడ అడిషనల్‌ డీజీపీలు జితేందర్‌, గోవింద్‌సింగ్‌, నార్త్‌జోన్‌ ఐజీపీ నాగిరెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ విభాగం ఇన్‌స్పెక్టర్లు ప్రకాశ్‌, శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐలు స్వామి, నరేశ్‌రెడ్డి, కరుణాకర్‌, తదితరులున్నారు. 


logo