మంగళవారం 20 అక్టోబర్ 2020
Karimnagar - Sep 24, 2020 , 01:38:31

ర్యాలీని విజయవంతం చేయాలి

ర్యాలీని విజయవంతం చేయాలి

  • n ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
  • n నియోజకవర్గ నాయకులతో సమావేశం

తిమ్మాపూర్‌ రూరల్‌ : రైతుల ఇబ్బందులు తొలగించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఈనెల 25న నిర్వహించే ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఎల్‌ఎండీ కాలనీలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టం, రైతుబంధు, రైతుబీమాతో పాటూ ఉచిత విద్యుత్‌తో అన్నదాతలకు కొండంత అండగా నిలిచిన కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ కృతజ్ఞత తెలపాల్సిన సమయం వచ్చిందన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు  1500 ట్రాక్టర్లతో అల్గునూర్‌ చౌరస్తా వద్ద ర్యాలీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ర్యాలీకి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక

గన్నేరువరం  : మండలంలోని మాదాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు భూపతిరెడ్డి ఎమ్మెల్యే రసమయి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో  టీఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపతిరెడ్డికి ఎమ్మెల్యే రసమయి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.  కార్యక్రమంలో జిల్లా ఆర్‌బీఎస్‌ కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి  టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, మండల సర్పంచుల , ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్‌రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ బోడ మాధవరెడ్డి, సర్పంచ్‌ కుమ్మరి సంపత్‌,  నూనె చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo