మంగళవారం 20 అక్టోబర్ 2020
Karimnagar - Sep 24, 2020 , 01:38:41

‘వేదిక’లను గడువులోగా పూర్తి చేయాలి

‘వేదిక’లను గడువులోగా పూర్తి చేయాలి

  • n పనుల్లో పారదర్శకత   పాటించాలి n కలెక్టర్‌ శశాంక

 కరీంనగర్‌, నమస్తే తెలంగాణ:  జిల్లాలో చేపట్టిన రైతు వేదికల పనులను గడువులోగా పూర్తి చేయా లని కలెక్టర్‌ శశాంక గ్రామీణాభివృద్ధ్ది, ఇంజినీరింగ్‌  అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా లో చేపట్టిన వేదికల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం పంచాయతీరాజ్‌ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిరంతరం పర్యవే క్షించి పనులను పూర్తి చేయించాలన్నారు.  నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. కూలీల కొరత ఉంటే ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి తె ప్పించాలని సూచించారు. వేదికలకు అవసరమైన కరెంటు ఏర్పాటుకు  రూ. లక్షలోపు పనులకు సంబంధించి బిల్లులను విద్యుత్‌ శాఖకు చెల్లించామని, అవి పూర్తయినవి లేనిది పరిశీలించాలన్నారు.   ప నుల్లో గుత్తేదారులు నిర్లక్ష్యం చేయవద్దని, చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పూర్తి చే సిన పనులకు ఇంజినీరింగ్‌ అధికారులు గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. జిల్లా లో అక్టోబర్‌ 15 నాటికి అన్ని రైతు వేదికలను ప్రా రంభానికి సిద్ధం చేయాలని నిర్దేశించారు. వర్షా లు  కురుస్తున్న నేపథ్యంలో మెటీరియల్‌ అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కడైనా పనులు జరిగే స్థలంలో ఇసుక కొరత ఉంటే మరో పని దగ్గర నుంచి అధికారుల అనుమతితో ఇసుక ను తీసుకువచ్చి పనులు పూర్తి చేయించాలన్నారు.  పీఆర్‌ ఎస్‌ఈ విష్ణువర్ధన్‌, డీఈలు ఉన్నారు.

స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి..

జిల్లాలోని మున్సిపల్‌,  పంచాయతీల్లో కొనుగో లు చేసిన స్థలాలకు  తప్పనిసరిగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవాలని కలెక్టర్‌ శశాంక సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఖాళీ స్థలాలు క్రమబద్ధీకరించుకునే విధంగా చూడాలన్నారు. నగర పొలిమేరలో ఉపయోగం లేని స్థలాలపై ఎక్కువ దరఖాస్తులు వస్తాయన్నారు. పాత   ఇండ్లకు మాత్రమే సర్వే నంబర్లు ఉన్నాయని, మిగితా వాటికి లేవన్నారు. ఇంటి నంబర్లు ఇవ్వకపోతే చాలా వరకు రెవెన్యూ తగ్గుతుందన్నారు. ఎంపీడీవోలు, జీపీల్లో అన్ని ఇండ్లకు నంబర్లు వేసే విధంగా చర్య లు తీసుకోవాలని, 10-15 శాతం ఇంటి నంబర్లు ఇవ్వకపోతే ఆదాయం కోల్పోతామన్నారు. 1437 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయని, అన్ని మం డల పరిధిలో  ఫ్లెక్సీలను మండలాల ఆఫీసుల్లో పె ట్టాలన్నారు. లోకల్‌ చానళ్లలో స్క్రోలింగ్‌ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 15 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో వాటిని పరిష్కరించాలన్నారు.  సమావేశంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ రశ్మీ పెరుమాళ్‌, అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి, డీఆర్‌వో వెంకటమాధవరావు, డీపీవో వీర బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు. 


logo