బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Sep 23, 2020 , 01:56:36

కొనసాగుతున్న థర్మల్‌ స్క్రీనింగ్‌

కొనసాగుతున్న థర్మల్‌ స్క్రీనింగ్‌

హుజూరాబాద్‌టౌన్‌ : హుజూరాబాద్‌ అర్బన్‌, చెల్పూర్‌ పీహెచ్‌సీల పరిధిలో మంగళవారం ప్రత్యేక వైద్య బృందాల సభ్యులు 395 ఇండ్లలో ఇంటింటికీ తిరిగి 1395 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారని హుజూరాబాద్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో జువేరియా తెలిపారు. హుజూరాబాద్‌ అర్బన్‌ పరిధిలోని సాయిబాబా టెంపుల్‌ ఏరియా, మారుతినగర్‌, విద్యానగర్‌, కాకతీయకాలనీ, ఇప్పల్‌నర్సింగాపూర్‌లో ఐదు బృందాల సభ్యులు 127ఇండ్లల్లో 477 మందికి ప్రత్యేక థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి ఉచిత మందులు అందజేశారు.  మండలంలోని చెల్పూర్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పెద్దపాపయ్యపల్లి, ఇందిరానగర్‌, చిన్నపాపయ్యపల్లి, చెల్పూర్‌,  సిర్సపల్లి, తోకలపల్లి, జూపాక, రంగాపూర్‌, కందుగుల, కనుకులగిద్ద, వెంకట్రావుపల్లిలో 268 ఇండ్లల్లో 918 మందికి 11 వైద్య బృందాల సభ్యులు స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. కొవిడ్‌-19 నిబంధనలు అందరూ పాటించాలన్నారు. కార్యక్రమాల్లో చెల్పూర్‌ పీహెచ్‌సీ వైద్యుడు, ఆర్‌బీఎస్‌కే  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మండలంలో నలుగురికి కరోనా

వీణవంక : మండలంలోని చల్లూరు, వీణవంక పీహెచ్‌సీల పరిధిలో మంగళవారం మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 53 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. కరోనా సోకిన వారిని హోంక్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు, ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే పీహెచ్‌సీల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


logo