బుధవారం 21 అక్టోబర్ 2020
Karimnagar - Sep 23, 2020 , 01:56:36

కనీస వేతనాలు చెల్లించాలని నిరసన

కనీస వేతనాలు చెల్లించాలని నిరసన

కరీంనగర్‌ హెల్త్‌: ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డులకు కొత్త టెండర్లలో కనీస వేతనం రూ. 21వేలు చెల్లించాలని కోరుతూ మంగళవారం దవాఖాన ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్‌ మాట్లాడుతూ కొవిడ్‌-19 వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్సెంటివ్‌ ఇవ్వాలని, కాంట్రాక్టర్‌ జమ చేయని పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులు కార్మికులకు చెల్లించాలన్నారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల వచ్చి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ బకాయిలపై అధికారులకు నివేదిక అందిస్తానని, పెండింగ్‌ వేతనాలు చెల్లించేలా  చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శారద, సరళ, ఉపాధ్యక్షురాలు కళావతి, నాయకులు రవి, అంజలి, కృష్ణ, అరుణ్‌, అశోక్‌, రాజేశ్వరి పాల్గొన్నారు.logo