గురువారం 22 అక్టోబర్ 2020
Karimnagar - Sep 23, 2020 , 01:56:37

వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు

వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు

  •  మేయర్‌ వై సునీల్‌రావు
  • 12వ డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాలు పరిశీలన

కార్పొరేషన్‌: నగరంలో ఇటీవల కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. 12వ డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కచ్చ కాలువల ద్వారా నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో మోటర్లను ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నామన్నారు. నగరంలోని ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని యజమానులకు సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నగరపాలక సంస్థ సిబ్బందితో ఖాళీ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేయించకపోతే సంబంధిత యజమానులకు రూ. 10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు  ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు పరిశుభ్రత పాటించాలన్నారు.   కార్పొరేటర్‌ తోట రాములు, కాలనీ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. 


logo