మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Sep 20, 2020 , 03:00:29

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

  •  వీడియో కాన్ఫరెన్స్‌లో    అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌ వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌ ఆదేశించారు. శనివారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్స్‌, కాంటాలు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కోతలకు ముందే ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేశ్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


logo