బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Sep 20, 2020 , 03:02:09

బీ ఆర్క్‌, బీ ప్లానింగ్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

బీ ఆర్క్‌, బీ ప్లానింగ్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్‌ కల్చరల్‌: బీ ఆర్క్‌, బీ ప్లానింగ్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు పలు కేటగిరిల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చూపినట్లు విద్యా సంస్థల చైర్మన్‌ డా వీ నరేందర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఓబీసీ కేటగిరిలో ఎం శ్రీజ బీ ఆర్క్‌లో జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు, బీ ప్లానింగ్‌లో జాతీయ స్థాయిలో 61వ ర్యాంకు సాధించింది. అలాగే, ఏ కళ్యాణ్‌సాగర్‌ ఓబీసీ కేటగిరిలో బీ ఆర్క్‌లో జాతీయస్థాయిలో 141వ ర్యాంకు, బీ ప్లానింగ్‌లో 141వ ర్యాంకు, పీ సూర్యప్రకాశ్‌రెడ్డి జనరల్‌ కేటగిరిలో బీ ఆర్క్‌లో జాతీయ స్థాయిలో 238వ ర్యాంకు, ఏ పృథ్వీరాజ్‌ ఎస్సీ కేటగిరిలో బీ ఆర్క్‌లో జాతీయ స్థాయిలో 264వ ర్యాంకు, బీ ప్లానింగ్‌లో 44వ ర్యాంకు సాధించారన్నారు. ఎన్‌ వశిష్టనాయక్‌ ఎస్టీ కేటగిరిలో బీ ఆర్క్‌లో జాతీయస్థాయిలో 390వ ర్యాంకు సాధించాడు. వీరితో పాటు మరికొంత మంది అల్ఫోర్స్‌ విద్యార్థులు బీ ఆర్క్‌, బీ ప్లానింగ్‌లో మంచి ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో తమ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చూపి అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్‌ డా వీ నరేందర్‌రెడ్డి అభినందించారు. 

కొత్తపల్లి: ఐఐటీ జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి మరోమారు ప్రతిభ చూపినట్లు విద్యా సంస్థల కరస్పాండెంట్‌ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శనివారం ప్రకటించిన  బీ ఆర్క్‌, బీ ప్లాన్‌ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. బీ ఆర్క్‌లో ఆలిండియా స్థాయిలో ఏ సంతోష్‌ (27వ ర్యాంకు), క్రాంతి కిరణ్‌ (479వ ర్యాంకు), బీ శివకృష్ణ (853వ ర్యాంకు), కే కళ్యాణ్‌ (935వ ర్యాంకు), జే వర్షితరావు (976వ ర్యాంకు)తో పాటు 1023, 1047, 1195, 1388, 1401, 1426, 1581, 1588, 1607, 1638 ర్యాంకులను మరికొంత మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. అలాగే, బీ ప్లాన్‌లో విభాగంలో  ఆలిండియా స్థాయిలో  ఏ సంతోష్‌ (7వ ర్యాంకు), జే వర్షితరావు (166వ ర్యాంకు), ఎన్‌ సందీప్‌కుమార్‌ (342వ ర్యాంకు), ఆర్‌ విశాల్‌ (447వ ర్యాంకు), పీ రఘుపతిరావు (702వ ర్యాంకు), ఆర్‌ పవన్‌దత్తు (921వ ర్యాంకు), సీహెచ్‌ శివకుమార్‌ (930వ ర్యాంకు), జీ సంప్రీతి (939వ ర్యాంకు),  జే రాఘవేంద్ర (973వ ర్యాంకు)తో పాటు 1009, 1003, 1236, 1290, 1291, 1513, 1542, 1548, 1563, 1574, 1639, 1686, 1729, 1738, 1776, 1862, 1863, 1866, 1871, 1902, 1914, 1924, 1939, 1998, 1999వ ర్యాంకులను పలువురు విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. కాగా, ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్‌తో పాటు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు. logo