బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Sep 20, 2020 , 03:02:49

మానేరుకు పెరిగిన వరద

మానేరుకు పెరిగిన వరద

తిమ్మాపూర్‌/ బోయినపల్లి/ గంభీరావుపేట : ఎగువన కురుస్తున్న వర్షాలతో మానేరు నదికి వరద ఉధృతి పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరుకు 2,050 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో మత్తడి దూకి దిగువకు వెళ్తున్నది. బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్సారార్‌ జలాశయం 9 గేట్ల ద్వారా 30,281 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. కాగా, వరద కాలువ ద్వారా 1670 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు చెప్పారు. జలాశయంలో ప్రస్తుతం 25.45 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ 8 గేట్ల ద్వారా 52,568 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. మోయతుమ్మెద వాగు నుంచి ప్రస్తుతం 24,737, మధ్యమానేరు నుంచి 30 వేలు, ఎల్‌ఎండీ పరీవాహక ప్రాంతాల నుంచి 640 చొప్పున మొత్తం 55, 377 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో రిజర్వాయర్‌ నీటిమట్టాన్ని అనుక్షణం పరిశీలిస్తున్న అధికారులు 8 గేట్ల ద్వారా 52,568, కాకతీయ కాలువ ద్వారా 2,500, తాగునీటి అవసరాల దృష్ట్యా 309 క్యూసెక్కుల చొప్పున మొత్తం 55,377 క్యూసెక్కుల నీళ్లు బయటికి వెళ్తున్నది. logo