మంగళవారం 20 అక్టోబర్ 2020
Karimnagar - Sep 19, 2020 , 02:20:52

డ్రైనేజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

డ్రైనేజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

  • n మేయర్‌ వై సునీల్‌రావు
  • n 34వ డివిజన్‌లో పర్యటన
  • n సమస్యలపై ఆరా

కార్పొరేషన్‌: నగరంలోని అన్ని డివిజన్లలో మురు గుకాలువల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మేయర్‌ వై  సునీల్‌రావు తెలిపారు. శుక్రవారం నగరంలోని 34వ డివిజన్‌లో పర్యటించారు. ప్ర జలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అనేక డివిజన్లలో  మురుగుకాలువలు శిథిలమయ్యాయని, కొన్నిచోట్ల మురుగునీరు పోవడంలేదని చెప్పారు.  మరమ్మతుకు తగిన చర్యలు తీసు కుంటామని పేర్కొన్నారు.  రోడ్లను ఆక్రమించి చేపట్టిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు సూచించారు. 34వ డివిజన్‌లో సమస్యలు పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతామన్నారు.  నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు.   ఇందుకు సంబంధించిన ప్రతిపా దనలు సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ షకీరా అంజూమ్‌, బర్కత్‌అలీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo