ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 17, 2020 , 02:52:29

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

  • రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి n పార్టీ బీమా చెక్కు అందజేత

కథలాపూర్‌: కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం చింతకుంట గ్రామానికి చెంది న చెదలు రాజేందర్‌ అనే టీఆర్‌ఎస్‌ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, పార్టీ బీమా తరఫున 2లక్షల చెక్కును బాధిత కుటుంబానికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. పార్టీలో పనిచేసే కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని సీఎం కేసీఆర్‌ బీమా సదుపాయం కల్పించారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా సౌక ర్యం ఉందన్నారు. పార్టీ అభివృద్ధిలో కార్యకర్తల సేవల మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెడ శంకర్‌, ఎంపీటీసీలు బాలమల్లేశ్‌, కొండ ఆంజనేయులు, నాయకులు వర్ధినేని నాగేశ్వర్‌రావు, సోమ దేవేందర్‌రెడ్డి, అల్లె సంతోష్‌, అందె రాజేశ్‌, వ్యాసమహార్షి, మేడిచెలిమెల వేణుగోపాల్‌, బద్దం మహేందర్‌రెడ్డి, చెదలు శేఖర్‌, పెడిమెల్లి గంగారాం, అందె స్వాగత్‌ పాల్గొన్నారు.


logo