గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 17, 2020 , 02:52:37

వేద ఆధారిత వ్యవసాయం అభినందనీయం

వేద ఆధారిత వ్యవసాయం అభినందనీయం

  • అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌

గన్నేరువరం : వేద విద్య ఆధారంగా వ్యవసాయం చేయడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌ అన్నారు. బుధవారం మండలంలోని పారువెల్లకు చెందిన వేద విద్యార్థి కౌటిల్య కృష్ణన్‌ 30 గుంటల్లో సాగు చేస్తున్న కృష్ణబ్రిహి (నల్లని వడ్ల) చేనును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌లాల్‌ మాట్లాడుతూ కౌటిల్యకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకొని రైతులు నల్లని వరిసాగుకు ముందుకు రావాలని సూచించారు. సాగు విధానం, వాటి ఉపయోగాలను శ్యాం ప్రసాద్‌లాల్‌ తెలుసుకున్నారు. ఏవోలు కిరణ్మయి, రమ్యశ్రీ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గంప వెంకన్న ఉన్నారు.


logo