మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 16, 2020 , 03:10:00

పోలీస్‌శాఖలో హెచ్‌ఆర్‌ఎంఎస్‌ విధానం

పోలీస్‌శాఖలో హెచ్‌ఆర్‌ఎంఎస్‌ విధానం

  • nడీజీపీ మహేందర్‌రెడ్డి
  • nపోలీస్‌ అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్‌

కరీంనగర్‌ క్రైం : పోలీస్‌శాఖలో పరిపాలన విధానాన్ని సులభతరం చేయడానికి  హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (హెచ్‌ఆర్‌ఎంఎస్‌) అమలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌శాఖలో అన్ని స్థాయిల అధికారులు వివిధ పనుల కోసం జిల్లా, కమిషనరేట్‌ కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదని, సంబంధిత పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ కేంద్రాలు, ఏసీపీ కార్యాలయాల నుంచే వివరాలు పొందుపరిచినట్లయితే వెంటనే పరిష్కారమవుతాయని తెలిపారు.    రాష్ట్రంలోని కమిషనరేట్లు, జిల్లాల పోలీసు అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా డీజీపీ మాట్లాడుతూ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ విధానం అమలు ప్రక్రియను నెల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. వివిధ రకాల సెలవులు, సర్వీస్‌ రికార్డులకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు. అన్ని స్థాయిల అధికారులు తమ సందేహాలను ఈ విధానంలో పొందుపరిచినట్లయితే వాటికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ విధానం అమలు ద్వారా ఎవరికైనా ఏ సమస్య ఉన్నా వెంటనే సరిచూసుకునే అవకాశం ఉంటుందన్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ నేరాల నియంత్రణలో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని, ఈ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ చంద్రమోహన్‌, ట్రైనీ ఐపీఎస్‌ రష్మి పెరుమాళ్‌, సీపీవో, పీటీసీ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు ఉమేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌, సూపరింటెండెంట్లు ఫయాజొద్దీన్‌, యాకుబ్‌ బాబా, పార్వతి, కళాధర్‌, తదితరులు పాల్గొన్నారు. logo