ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 14, 2020 , 03:01:30

జీవనదిలా వరదకాలువ

జీవనదిలా వరదకాలువ

రామడుగు: సీఎం కేసీఆర్‌ రూపకల్పనతోనే వరదకాలువ జీవనదిలా మారిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. రామడుగు మండల పరిధిలోని వరదకాలువకు ఏర్పాటు చేసే తూములు, కాలువల నిర్మాణ స్థలాలను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ పోల్సాని వెంకటరామారావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా ఎకరం కూడా ముంపునకు గురి కాకుండా విశ్రాంత సీఈ పోల్సాని వెంకటరామారావు అందించిన అత్యుత్తమ ప్రణాళికలతోనే వరదకాలువకు తూములు, కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. దీనికి రూ.248 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనివెనుక ఎన్నో ఏండ్ల శ్రమ దాగి ఉందన్నారు. గత ప్రభుత్వం తెరమీదికి తెచ్చిన మోతె రిజర్వాయర్‌ను నిర్మించాలని తాము ప్రయత్నించగా కొరటపల్లి, షానగర్‌, రామడుగు గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచు కొని విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ అందించిన ప్రణాళికలపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి సమాలోచనలు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యేతో కలిసివెళ్లి సీఎం కేసీఆర్‌ను ఒప్పించినట్లు తెలిపారు. వరదకాలువ జీవనదిలా మారనుందని, పాడి పంటలతో పాటు మ త్స్య సంపద పెరుగుతుందని ఏడేండ్ల క్రితమే తాను చెప్పినట్లు గుర్తు చేశారు. మరో ఏడాదిన్నరలో తూ ములు, కాలువల నిర్మాణాలు పూర్తయి 26 వేల ఎ కరాలకు పైగా నీరందుతుందన్నారు. బంగారం పం డే భూములను రైతులు అమ్ముకోవద్దని కోరారు.

ప్రాణమున్నంత వరకు సీఎంకు రుణపడి ఉంటా:  ఎమ్మెల్యే సుంకె 

అంతకుముందు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో చొప్పదండి నియోజకవర్గం సాగునీరు లేక ఎడారిలా తలపించేదని, కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా వేల ఎకరాలకు నీరందుతున్నదని చెప్పారు. తన జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఏదైనా సాధించానంటే అది కేవలం వరద కాలువకు తూములు, కాలువల నిర్మాణమేనన్నారు. ఇందు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్‌, ఐటీమంత్రి కేసీఆర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు. విశ్రాంత సీఈ పోల్సాని వెంకటరామారావు మాట్లాడుతూ గతంలో మోతె రిజర్వాయర్‌ చేపడితే మునిగిపోయే కొరటపల్లి గ్రామం ఇప్పుడు వరదకాలువకు తూములు, కా లువల నిర్మాణంతో ఆయకట్టుగా మారిందన్నారు. రామడుగు మండలమే కాకుండా గంగాధర, చొప్పదండి, పెగడపల్లి, ధర్మారం, కరీంనగర్‌ శివారు గ్రా మాలకు కూడా నీరు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిర్మలాపూర్‌, రామడుగు, షానగర్‌, వెదిర సమీపంలో వరదకాలువకు ఏర్పాటు చేస్తున్న తూముల నిర్మాణ స్థలాలను పరిశీలించారు. తిర్మలాపూర్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, రామడుగు విండో చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, ఆర్బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ జూపాక కరుణాకర్‌, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, పార్టీ మండలాధ్యక్షు డు గంట్ల జితేందర్‌రెడ్డి, చొప్పదండి, గంగాధర ఎంపీపీలు చిలుక రవీందర్‌, శ్రీరాం మధూకర్‌, చొప్పదండి, గంగాధర మండలాల ఏఎంసీ చైర్మన్లు చంద్రశేఖర్‌గౌడ్‌, సాగి మహిపాల్‌రావు, విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.logo