శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 14, 2020 , 02:42:53

‘నీట్‌' ప్రశాంతం

‘నీట్‌' ప్రశాంతం

తిమ్మాపూర్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఆదివారం నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 10 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించగా, ఉదయం 11  నుంచే విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, శానిటైజేషన్‌ టన్నెల్‌ ద్వారా లోనికి అనుమతించారు. మొత్తం 5409 మంది విద్యార్థులకు 4967 మంది హాజరు కాగా, 442 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు నీట్‌ సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టీ లలితకుమారి తెలిపారు. తిమ్మాపూర్‌ మండలంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో 600 మందికి 546, వాగేశ్వరి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 780 మందికి 734, శ్రీ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో 540 మందికి 494, శ్రీ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ కళాశాలలో 480 మందికి 449, కరీంనగర్‌ బైపాస్‌ రోడ్‌లోని వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌లో 720 మందికి 651, ఇదే కళాశాలలోని మరో సెంటర్‌లో 300 మందికి 279, చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో 540 మందికి 500, జగిత్యాల రోడ్‌లోని వివేకానంద డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో 309 మందికి 263, వివేకానంద రెసిడెన్షియల్‌ పాఠశాల (సీబీఎస్‌ఈ)లో 540 మందికి 494, హుజూరాబాద్‌లోని కమల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో 600 మందికి 557 మంది హాజరైనట్లు తెలిపారు. కాగా, ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ముందుగా నిర్ణయించిన ప్రకారం విద్యార్థులను కేంద్రాల్లోనికి అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించ లేదు. logo