గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Sep 13, 2020 , 02:22:14

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

  • n టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో  పటాకలు కాల్చి,  స్వీట్ల పంపిణీ

ఎలిగేడు: నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకలు కాలుస్తూ.. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశా రు. ఎలిగేడు, సుల్తాన్‌పూర్‌, బుర్హాన్‌మియాపేట, శివపల్లి, లోకపేటల్లో సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు సీఎం సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించారు. స్థానికులకు స్వీట్లు పంచారు. కార్యక్రమాల్లో ఎంపీపీ తానిపర్తి స్రవంతి, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ మండిగ రేణుక, వైస్‌ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు, నారాయణపల్లి సర్పంచ్‌ మాడ కొండాల్‌రెడ్డి, సర్పంచులు బూర్ల సింధూజ, సుల్తాన్‌పూర్‌ ఉప సర్పంచ్‌ ఆకుల హరీశ్‌గౌడ్‌,  టీఆర్‌ఎస్‌ నాయకులు, వర్తక సంఘం అధ్యక్షుడు వెంగళ భాస్కర్‌ కార్యవర్గ సభ్యులు, లోకపేట సర్పంచ్‌ ప్రభావతి, బుర్హాన్‌మియాపేట సర్పంచ్‌ రాచర్ల కొండయ్యరాజా, శివపల్లి తదితరులు పాల్గొన్నారు.  

సుల్తానాబాద్‌రూరల్‌: సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చిత్రపటాలకు గర్రెపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టి, పటాకలు పేల్చి సంబురాలు చేసుకున్నారు. అలాగే చిన్నకల్వలలో సర్పంచ్‌ రమేశ్‌గౌడ్‌, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, మొండయ్య ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు, గర్రెపల్లి సర్పంచ్‌ వీరగోని సుజాత, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ దీకొండ శ్రీనివాస్‌, నాయకులు వీరగోని రమేశ్‌గౌడ్‌, వడ్కాపురం ఆంజనేయులు, బొల్లం లక్ష్మణ్‌, ఆసరి రాజయ్య, ఉమ్మెంతుల ప్రతాప్‌రెడ్డి, మహేందర్‌, కనుకయ్య, శ్రీనివాస్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

కాల్వశ్రీరాంపూర్‌ : టీఆర్‌ఎస్‌ నాయకులు మండల కేంద్రంలో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పటాకలు కాల్చి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, విండో చైర్మన్‌ చదువు రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీ జెట్టి దేవన్న, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్య, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, టీఆర్‌ఎస్‌ నాయకులు మాదాసి రాంచంద్రం, కూకట్ల నవీన్‌, బోయిని సదానందం, బండ మల్లారెడ్డి, సువర్ణ బిట్టు, ఒడ్నాల శ్రీనివాస్‌, ఖదీర్‌, బొమ్మ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే దాసరికి శుభాకాంక్షలు

పెద్దపల్లి జంక్షన్‌: అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి పూల మొక్కను అందజేశారు. కార్యక్రమంలో సుల్తాన్‌బాద్‌ ఎంపీపీ బాలాజీరావు, పెద్దపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ నాజ్మీన్‌ సుల్తానామొబిన్‌, కౌన్సిలర్లు పైడ పద్మరవి, నూర్జహాన్‌ అశ్రఫ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కుంభం సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి కల్చరల్‌:  నల్ల మనోహర్‌రెడ్డి యువసేన సభ్యులు పెద్దపల్లిలో సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని సాగర్‌రోడ్‌లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎస్‌కే బషీర్‌, షకీల్‌, అలువోజు రవితేజ, కలీమ్‌, తాజ్‌ఖాన్‌, అప్సర్‌, నదీమ్‌, వాసిమ్‌, మసూద్‌, ములుగూరి సాయి తదితరులు పాల్గొన్నారు.


logo