శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 11, 2020 , 03:04:49

మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలి

మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలి

  • n ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలి
  • n డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు
  • n మహాత్మానగర్‌, తిమ్మాపూర్‌   గ్రామాల్లో పర్యటన
  • n రాజీవ్‌ రహదారికి ఇరువైపుల  నాటిన మొక్కల పరిశీలన

తిమ్మాపూర్‌: హరితహారంలో నాటిన మొక్కల సం రక్షణపై దృష్టి పెట్టాలని డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు పంచాయతీ పాలకవర్గాలు, అధికారులకు సూచించారు. గురువారం మహాత్మానగర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో రాజీవ్‌ రహదారికి ఇరువైపుల నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంట్‌ వైర్ల కింద పూలు, తక్కువ ఎత్తు ఎదిగే మొక్కలను నాటాలన్నారు. అలాగే రక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్‌ యార్డు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా 2020-21 సంవత్సరానికి గాను నర్సరీల్లో పెంచే మొక్కల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్దేశించారు. గ్రామాల్లో రైతులకు అవసరమున్న మొక్కల వివరాలను సేకరించాలన్నారు. ఈ దిశగా ఇప్పటి నుంచే స మాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ మంజులాదేవి, ఎంపీడీవో చింతల రవీందర్‌రెడ్డి, ఎంపీవో కిరణ్‌కుమార్‌, ఫారెస్ట్‌ అధికారులు, పం చాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.


logo