శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 10, 2020 , 03:39:42

ఘనంగా ప్రజాకవి జయంతి

ఘనంగా ప్రజాకవి జయంతి

  • కాళోజీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

కార్పొరేషన్‌:  జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు అని నగర మేయర్‌ వై సునీల్‌రావు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి మేయర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాకవిగా తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అంతకు ముందు రేకుర్తిలోని కాళోజీ విగ్రహానికి మేయర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేట్లు సుధగోని మాధవి, చాడగొండ బుచ్చిరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యురాలు నందెల్లి రమ తదితరులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌ క్రైం: పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో కాళోజీ చిత్రపటానికి సీపీ కమలాసన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌, ఏసీపీ కార్యాలయాలతో పాటు పీటీసీలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి రష్మి, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, జానీమియా, సుధాకర్‌, పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ రవి, డీఎస్పీ శ్రీనివాసులు, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. 

కొత్తపల్లి: కరీంనగర్‌తో పాటు కొత్తపల్లి మండలం, మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కాళోజీ చిత్రపటానికి చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుడా డైరెక్టర్‌, చింతకుంట ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్‌, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ఫహాద్‌, నాయకులు సాయి, రవితేజ, శివ, నవీన్‌, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

కొత్తపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో...

కొత్తపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ రుద్ర రాజు, పాలకవర్గ సభ్యులు, అధికారులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు సాబీర్‌బాషా, ఎంపీటీసీలు తిరుపతినాయక్‌, దామ కమల మనోహర్‌, పట్టం శారదలక్ష్మీనారాయణ, ఎంపీవో శ్రీనివాస్‌, ఆరిఫ్‌, దేవిక, రవి తదితరులు పాల్గొన్నారు. 

కొత్తపల్లి: నగరంలోని పశుగణాభివృద్ధి సంస్థలో కాళోజీ చిత్రపటం వద్ద పశుగణాభివృద్ధి సంస్థ(టీఎస్‌) చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావు నివాళులర్పించారు.  పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు డాక్టర్‌ నరేందర్‌, వేణుగోపాల్‌రావు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.  

తెలంగాణచౌక్‌: ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో కాళోజీ చిత్రపటానికి ఆర్టీసీ ఆర్‌ఎం పల్లె జీవన్‌ప్రసాద్‌, డివిజనల్‌ మేనేజర్‌ రవిశంకర్‌ రెడ్డి, డిపో-1 మేనేజర్‌ అర్పిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అకౌంట్స్‌ అధికారి లావణ్య, పర్సనల్‌ అధికారి చంద్రయ్య, ఆర్‌ఎం ఆఫీస్‌ సూపర్‌వైజర్‌ హిమబిందు, స్టేషన్‌ మేనేజర్‌ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌: రేకుర్తిలోని కాళోజీ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీధర్‌, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త అనిల్‌కుమార్‌ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు జయంతి రోజును ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం తెలంగాణ యాసకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. logo