మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 09, 2020 , 02:24:16

సేవా భావం.. రోడ్డు నిర్మాణం..

సేవా భావం.. రోడ్డు నిర్మాణం..

  • రైతుల కష్టం దూరం చేయడానికి రూ.12 లక్షలు వ్యయం 

జూలపల్లి : పెద్దాపూర్‌లో కళ్లెంరెడ్డిపల్లె-కుర్మపల్లె మట్టిరోడ్డును తన స్వంత ఖర్చుతో పునరుద్ధరించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకుడు, బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేకే శేఖర్‌యాదవ్‌ సేవా భావంతో ముందుకు వచ్చారు. 2009లో కుర్మపల్లె మట్టి రోడ్డును కోరంతకుంట దాకా దాదాపు రూ.7 లక్షలు సొంత ఖర్చులతో మెరుగుపర్చారు. ఈ క్రమంలో మరోసారి రైతులు విజ్ఞప్తి చేయగా, జేకే శేఖర్‌యాదవ్‌ మంగళవారం దాదాపు రూ.12 లక్షల అంచనా వ్యయంతో మూడు కిలోమీటర్ల పొడవు మట్టిరోడ్డు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులు చేసి స్వగ్రామాన్ని ఆదర్శంగా తీర్చిద్దిడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు తోడు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకు వచ్చి పల్లెతల్లి రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజాప్రతినిధులు, దాతలు నిస్వార్థంగా సమాజం కోసం అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఇక్కడ నాయకులు కంకణాల జ్యోతిబసు, బొజ్జ శ్రీనివాస్‌, తీగల అశోక్‌, గొడ్డండ్ల గంగయ్య, బుర్ర మహేశ్‌, కంకణాల వెంకటేశ్‌, బొజ్జ స్వామి, తోట వెంకటయ్య, జెల్ల కన్కయ్య, గుర్రం బుచ్చయ్య, కళ్లెం ఆదిరెడ్డి, బొజ్జ మల్లయ్య, కళ్లెం మల్లారెడ్డి, రాజన్నల సతీశ్‌, అల్లాడి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo