శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 08, 2020 , 01:31:15

ఎంసెట్‌, నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఎంసెట్‌, నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఎంసెట్‌, నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఎంసెట్‌, నీట్‌ నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11, 14, 28, 29వ తేదీల్లో ఎంసెట్‌, 13న నీట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంసెట్‌ ఎస్‌-1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు ఉదయం 7 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎస్‌-2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. జిల్లాలో 5,408 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలన్నారు. ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, కేంద్రం ఇన్‌చార్జి పూర్తి బాధ్యత వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్యుడు, ఇద్దరు ఆశ కార్యకర్తలు, హెల్త్‌ సూపరింటెండెంట్‌ ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.  డీఆర్వో వెంకటమాధవరావు, డీపీవో బుచ్చయ్య, ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.logo