సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 06, 2020 , 02:35:31

హుజూరాబాద్‌లో ప్రత్యేక బృందం పర్యటన

హుజూరాబాద్‌లో ప్రత్యేక బృందం పర్యటన

హుజూరాబాద్‌టౌన్‌: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశాలతో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం శనివారం హుజూరాబాద్‌ పురపాలక సంఘం పరిధిలో పర్యటించారు. హుజూరాబాద్‌ను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కంప్రెహెన్సీవ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ తయారు చేయడానికి స్వయంగా కాలినడకన పట్టణం మొత్తం తిరిగి ప్రణాళికలు తయారు చేశారు. మంత్రి ఈటల, ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చే ఆరు నెలల్లో హుజూరాబాద్‌ పట్టణం రూపురేఖలు మారేలా చర్యలు తీసుకుంటామని బృందం సభ్యుడు, వరంగల్‌ ఆర్‌డీఎంఏ మసూద్‌ అహ్మద్‌ తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులకు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, డ్రింకింగ్‌ వాటర్‌, డ్రైనేజీలు, పార్కులు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్‌, కూరగాయల, మాంసం మార్కెట్లు ఏర్పాటు, వైకుంఠధామాలు, డంప్‌ యార్డులు, చెరువుల సందరీకరణ, మోడల్‌ చెరువుపై ట్యాంక్‌బండ్‌ నిర్మాణం, పందుల రిహాబిలిటేషన్‌, రింగ్‌ రోడ్ల నిర్మాణాలపై ప్రణాళికలు రూపొందిస్తారు. ఆర్‌డీఎంఏ మసూద్‌అహ్మద్‌, వరంగల్‌ పీహెచ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, వరంగల్‌ ఆర్‌డీటీపీ రవీందర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ డీఎఫ్‌వో లీలాప్రకాశ్‌, ఈఈ ఎస్‌ నర్సింహారెడ్డి, హైదరాబాద్‌ (NIUM) నాలేడ్జ్‌ మేనేజర్‌  ప్రవీణ్‌,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, కమిషనర్‌ ఈ జోన, ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.logo