బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 06, 2020 , 02:35:32

కొత్తపల్లి మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం

కొత్తపల్లి మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం

కొత్తపల్లి: కొత్తపల్లి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో శనివారం చైర్మన్‌ రుద్ర రాజు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై పాలకవర్గ సభ్యులు, అధికారులు చర్చించారు. సమావేశానికి ముందు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వైస్‌ చైర్‌పర్సన్‌ బండ రాధ మృతికి పాలకవర్గ సభ్యులు, అధికారులు సంతాపం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌, 14వ ఆర్థిక సంఘం నిధులు, హరితహారం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య వాహనాల కొనుగోలు, మురుగు కాలువల మరమ్మతు పనులతో పాటు పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 53 లక్షలు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 24 లక్షలు అందుబాటులో ఉండగా వాటితో అభివృద్ధి పనులు చేపట్టేందుకు  చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులు తీర్మానాలు చేశారు.  కమిషనర్‌ ఎ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు జెర్రిపోతుల మొండయ్య, జెర్రిపోతుల అంజలి, మానుపాటి వేణుగోపాల్‌, గున్నాల విజయ, ఎస్‌కే నాజియ, స్వర్గం వజ్రాదేవి, గండు రాంబాబు, సత్యనారాయణరెడ్డి, కవిత  పాల్గొన్నారు. 


logo