శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 02, 2020 , 02:48:30

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

 ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

 చొప్పదండి: రామడుగు మండలంలో  వరద కాలువకు నాలుగు చోట్ల తూముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాట్నపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద కాలువకు తూములు నిర్మిస్తే గుమ్లాపూర్‌, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, మల్లన్నపల్లి, కోనేరుపల్లి గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీటి సమస్య తీరుతుందన్నారు.  నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కుమార్‌, నాయకులు వెంకటేశ్‌, వేణు తదితరులు పాల్గొన్నారు. logo