శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 01, 2020 , 02:25:17

ప్రశాంతంగా ఈ సెట్‌

ప్రశాంతంగా ఈ సెట్‌

  • n వాగేశ్వరి, శ్రీ చైతన్య కళాశాలల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష
  • n 2143 మందికి 2061 మంది హాజరు
  • n 82 మంది గైర్హాజరు

తిమ్మాపూర్‌: కరోనా కారణంగా వాయిదాపడ్డ ప్రవేశ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి ఈసెట్‌-2020 కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించారు. వాగేశ్వరి, శ్రీ చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌ద్వారా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,143 మంది అభ్యర్థులకు గానూ 2,061 మంది హాజరు కాగా, 82 మంది గైర్హాజరయ్యారు. వాగేశ్వరిలోని ఆయాన్‌ డిజిటల్‌ సెంటర్‌లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో 970మందికి 935మంది హాజరు కాగా, 35 మంది గైర్హాజరయ్యారు. వాగేశ్వరి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో  460 మందికి గాను 447 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. అలాగే శ్రీ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో455 మందికి 442 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలాజికల్‌ సైన్సెస్‌లో 258మందికి గాను 237 మంది హాజరు కాగా, 21 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌  చేసిన అనంతరమే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రంలో కొవిడ్‌ నిబంధనల ప్రకారం శానిటైజ్‌ చేయించారు.


logo