గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 01, 2020 , 02:25:20

కూరగాయల సాగును ప్రోత్సహించాలి

కూరగాయల సాగును ప్రోత్సహించాలి

తిమ్మాపూర్‌ రూరల్‌ : కూరగాయల సాగును ప్రోత్సహించాలని, పంటల నమోదు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉద్యాన వన కార్యాలయ సహాయ సంచాలకురాలు సువర్ణ అధికారులకు సూచించారు. వెబ్‌సైట్‌లో నమోదు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిమ్మాపూర్‌ గ్రామంలో వివిధ పద్ధతుల్లో సాగు చేస్తున్న కూరగాయల పంటలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేసుకోవాలన్నారు.  జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి శ్రీనివాస్‌, కే స్వాతి, ఏఈవో పున్నంచందర్‌ పాల్గొన్నారు.

రైతులు విత్తనోత్పత్తి చేసుకోవాలి

తిమ్మాపూర్‌ రూరల్‌ : రైతులు పండించిన పంటలోని మెరుగైన ధాన్యాన్ని విత్తనోత్పత్తికి వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌ అన్నారు. మండలంలోని మొగిలిపాలెంలో రైతులకు అవగాహన కల్పించారు. ఏవో సురేందర్‌, ఎంపీటీసీ తిలక్‌ప్రియారెడ్డి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.


logo