శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 01, 2020 , 02:25:23

నేరుగా సేవ చేసే అవకాశం పోలీస్‌తోనే సాధ్యం

నేరుగా సేవ చేసే అవకాశం పోలీస్‌తోనే సాధ్యం

  • జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ

జగిత్యాల క్రైం: సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలు, బాధితులకు నేరుగా సేవ చేసే అధికారం పోలీసు ఉద్యోగులకు మాత్రమే లభిస్తుందని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు. వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ ఎండీ షఫీయొద్దీన్‌, పీసీఆర్‌ ఎస్‌ఐ అబిదుల్లా రహీమ్‌,  జగిత్యాల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న గంగారాం, రాయికల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్‌ సోమవారం ఉద్యోగ విరమణ పొందగా జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ వీరిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందిన అధికారులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఉద్యోగ విరమణానంతర జీవితాన్ని సంతోషంగా గడుపాలన్నారు. ఏ రంగంలోనైనా నిబద్ధతతో పనిచేసినప్పుడే అందుకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పోలీసు ఉద్యోగ సమయంలో ఎన్నో రకాల త్యాగాలతో విధులు నిర్వర్తించి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం గర్వకారణమన్నారు. న్యాయం కోసం వచ్చే బాధితులకు పోలీసు ఉద్యోగం అండగా నిలుస్తుందన్నారు. ఎస్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, డీపీవో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ సైదులు, ఎస్‌బీ ఎస్‌ఐ ఉపేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. 


logo