బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 30, 2020 , 02:24:46

ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి

ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి

  • lసీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపాలి
  • lకరోనా వస్తే అధైర్యపడొద్దు
  • lమానకొండూర్‌ ఎమ్మెల్యే     రసమయి బాలకిషన్‌

తిమ్మాపూర్‌/ మానకొండూర్‌ రూరల్‌ : పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. శనివారం తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 108 మందికి కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. కోటీ 81 లక్షల 2 వేల 528 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే మానకొండూర్‌ మండలం ముంజంపల్లి కేఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో 148 మంది లబ్ధిదారులకు రూ. కోటీ 46 లక్షల 92 వేల 168 విలువైన చెక్కులను సుడా చైర్మన్‌ జీవీఆర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ పేద ఆడబిడ్డల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ఉంటూ ప్రేమాభిమానాలు చూపాలన్నారు. కల్యాణలక్ష్మి కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ చెక్కులు వస్తాయని తెలిపారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు అధైర్యపడవద్దని, బలవర్ధక ఆహారం తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు సైతం కరోనా బాధితులకు సహకారం అందించాలని సూచించారు. తిమ్మాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు చేస్తున్నారని, అవసరమైన వారు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, ముంజంపల్లిలో జడ్పీటీసీ శేఖర్‌గౌడ్‌, ఎంపీపీ ముద్దసాని సులోచన, తహసీల్దార్‌ రాజయ్య, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ వాల ప్రదీప్‌రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల వంశీధర్‌ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోపు రవీందర్‌ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ రామంచ గోపాల్‌రెడ్డి, కేడీసీసీ ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, రైతు బంధు కన్వీనర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గ్గొన్నారు.


logo