శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 29, 2020 , 02:23:38

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

  • n నాణ్యతలో రాజీ పడవద్దు
  • n సెప్టెంబర్‌ 5లోగా ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలి
  • n రైతు సమస్యల పరిష్కారానికే వేదికలు
  • n మంత్రి గంగుల కమలాకర్‌
  • n మొగ్ధుంపూర్‌, బద్దిపల్లిలో రైతు వేదిక పనుల పరిశీలన

కరీంనగర్‌ రూరల్‌/కొత్తపల్లి: రైతు వేదికలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, వచ్చే నెల 5లోగా ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌ శశాంకతో కలిసి కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్ధుంపూర్‌, కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్‌ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికల పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్నారు. నిర్దేశిత గడువులోగా వేదిక నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు సమస్యలను ఒకే వేదికపై చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టిందన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వేదికల్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు వివరించనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండేలా ఇక్కడే వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ వేదికలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పంటల సాగులో వారికి సలహాలు, సూచనలు, సీజనల్‌ వారీగా ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ వేదికల ద్వారా వివరిస్తారన్నారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, ఆర్టీఏ మెంబర్‌ తోట శ్రీపతిరావు, జిల్లా వ్యవసాయ అధికారి వీ శ్రీధర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ చిల్ల శ్రీనివాస్‌, ఏఓ రంజిత్‌, బద్దిపల్లి సర్పంచ్‌ రాచమల్ల మధు, కమాన్‌పూర్‌ సర్పంచ్‌ జింక సంపత్‌, బద్దిపల్లి టీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పు రాజశేఖర్‌, తాండ్ర శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo