గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 29, 2020 , 02:23:38

బాలల హక్కులు కాపాడాలి

బాలల హక్కులు కాపాడాలి

కరీంనగర్‌ రూరల్‌ : బాలల హక్కులను కాపాడాలని వీసీపీసీ సభ్యులు అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ మండలంలోని చెర్లభూత్కూర్‌ గ్రామ పంచాయతీలో  వీసీపీసీ ట్రైనింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌, సర్పంచ్‌ దబ్బెట రమణారెడ్డి మాట్లాడారు..  బాలలపై జరుగుతున్న హింసను అరికట్టాలని కోరారు. బడి బయట పిల్లలు ఉంటే వారిని బడిలో చేర్పించాలని సూచించారు. సమస్యలు ఉంటే చైల్డ్‌ లైన్‌ 1098 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. అనంతరం ఆపదలో ఉన్న బాలలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఐసీపీఎస్‌ ఆధికారి రమేశ్‌, కార్యదర్శి రాము, ఏఎన్‌ఎం, సూపర్‌ వైజర్‌  ఆశ వర్కర్లు, ఐసీడీఎస్‌ పద్మ, భాగ్య  వార్డు సభ్యులు పాల్గొన్నారు.


logo