గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 28, 2020 , 02:34:40

‘రూర్బన్‌' పనుల్లో వేగం పెంచాలి

‘రూర్బన్‌' పనుల్లో వేగం పెంచాలి

  • n డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలి
  • n అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
  • n కలెక్టర్‌ శశాంక
  • n జమ్మికుంట,  ఇల్లందకుంటలో పర్యటన

జమ్మికుంట: రూర్బన్‌ పథకం కింద చేపట్టిన అభి వృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ శశాంక అ ధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ నెలాఖరు లోగా పూర్తి చేయాలని సూచించారు. గురువారం ఆయన జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పర్యటించారు. ధర్మారం, సైదాబాద్‌ శివారులోని దుబ్బ మల్లన్న గుడి ఆవరణలో  కొనసాగుతున్న  విశ్రాంతి గదులు(రూ.50లక్షలు), మండపం (రూ.50లక్షలు), ట్రైనింగ్‌ సెంటర్‌(రూ.కోటి 75 లక్షలు), శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద  చేపట్టిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను పరిశీ లించారు.  మల్లన్నను దర్శించుకున్నారు. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇల్లందకుంటలో రిజర్వాయర్‌ అభివృద్ధి( రూ.30లక్షలు), షాపింగ్‌ క్లాంప్లె క్స్‌ (రూ. 50 లక్షలు) నిర్మాణ పనులను పరిశీలించారు. రిజర్వాయర్‌ వద్ద పెంచుతున్న మొక్కలు, ట్ట అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసు కు న్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాసిరకం పనులను సహించేది లేదని హెచ్చరించారు.  నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అధి కారులు నిత్యం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తాగునీరు, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. పా ర్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని చె ప్పారు. కలెక్టర్‌ వెంట డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో బెన్‌షాలోం, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్‌ శ్యాం, తహసీల్దార్‌ నారాయణ, ఎంపీడీవో జయశ్రీ, డిప్యూటీ ఈఈ నరేందర్‌రెడ్డి, ఏఈలు మల్లారెడ్డి, నాగేశ్వరాచారి, రమేశ్‌, శ్రీకాంత్‌రెడ్డి, 

ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఉపాధ్యక్షుడు కందాల కొంరెల్లి, పీడీ వెంకటేశ్వరావు, ఏపీడీ శ్రీధర్‌,  తహసీల్దార్‌ సురేఖ, ఎంపీడీఓ స్వరూప, ఏఓ రజిత, తదితరులు ఉన్నారు. 


logo