గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 27, 2020 , 02:38:42

ధాన్యం ‘కమీషన్‌' విడుదల

ధాన్యం ‘కమీషన్‌' విడుదల

  • మూడు సహకారం సంఘాల ఖాతాల్లో 51లక్షలు జమ 

పెగడపల్లి: ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యానికి ప్రభు త్వం కమీషన్‌ విడుదల చేసింది. 2018-2019 యాసంగిలో మండలంలోని మూడు సంఘాల ద్వారా ధాన్యం కొనుగో లు చేయగా, 51 లక్ష లు సంఘాల ఖాతాల్లో జమ చేసింది. పెగడపల్లి ప్రాథమిక సంఘానికి 24.26లక్షల కమీషన్‌ వచ్చినట్లు చైర్మన్‌ వోరుగంటి రమణారావు, సీఈవో తడ్కమడ్ల గోపాల్‌రెడ్డి తెలిపారు. నంచర్ల సంఘానికి 16.10లక్షలు వచ్చినట్లు చైర్మన్‌ మంత్రి వేణుగోపాల్‌, సీఈవో రౌతు మధుకర్‌ తెలిపారు. నందగిరి సంఘానికి 10లక్షల కమీషన్‌ వచ్చిందని చైర్మన్‌ కర్ర భాస్కర్‌రెడ్డి, సీఈవో సంకిటి రవీందర్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వం కమీషన్‌ డబ్బులు విడుదల చేయడంతో సంఘాల చైర్మన్లు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పనతోపాటు, సంఘాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తామని సం ఘాల చైర్మన్లు పేర్కొన్నారు.


logo