శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 26, 2020 , 02:26:36

ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచుకోవాలి

ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచుకోవాలి

  •  n నగర మేయర్‌ వై సునీల్‌రావు   n23వ డివిజన్‌లో పర్యటన

కార్పొరేషన్‌: నగరంలోని ఖాళీ స్థలాలను సంబంధిత యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని మేయర్‌ వై సునీల్‌రావు సూచించారు. నగరంలోని 23వ డివిజన్‌లో మంగళవారం ఆయన పర్యటించారు. డివిజన్‌లోని ఖాళీ స్థలాల్లో నిలిచిన వర్షపు నీటిని మున్సిపల్‌ సిబ్బందితో తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో నిలిచిన వర్షపు నీటిలో దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అన్ని డివిజన్లలోని ఖాళీస్థలాల్లో నిలిచి ఉన్న నీటిని  నాలుగు రోజులుగా పారిశుద్ధ్య సిబ్బంది, డీఆర్‌ఎస్‌ బృందాలతో తొలగిస్తున్నట్లు తెలిపారు. సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖాళీ స్థలాలు పరిశుభ్రంగా ఉంచేందుకు బల్దియా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఖాళీ స్థలం యజమాని వివరాలను బల్దియా అధికారులు సేకరించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వారికి నోటీసులు అందించామని, మరోసారి కూడా నోటీసులు అందిస్తామన్నారు. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిని తొలగించిన అనంతరం యజమానులపై మున్సిపల్‌ చట్టం ప్రకారం జరిమానా విధిస్తామన్నారు. స్పందించని యజమానుల ఖాళీ స్థలాల్లో మున్సిపల్‌ పేరిట బోర్డు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలు ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి మున్సిపల్‌ సిబ్బంది తీసుకువచ్చే వాహనాల్లో వేయాలని సూచించారు.  కార్పొరేటర్‌ కిరణ్మయి, అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు. logo