శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 26, 2020 , 02:26:37

‘డబుల్‌' ఇండ్లతో సొంతింటి కల సాకారం

‘డబుల్‌' ఇండ్లతో సొంతింటి కల సాకారం

చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మండలంలో 69 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేసి పేదలకు కానుకగా ఇస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులందరికీ డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 వంతెన నిర్మాణ స్థలం పరిశీలన 

చొప్పదండి: కొక్కెరకుంట వాగులో వంతెన నిర్మాణానికి  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌  స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని గుమ్లాపూర్‌, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, కోనేరుపల్లి, మల్లన్నపల్లి, గుంటూరుపల్లి, చిట్యాలపల్లి, మంగళపల్లి గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యార్థం కొక్కెరకుంట వాగులో వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. వాగులో వంతెన నిర్మాణానికి సంబంధించి అధికారులతో మాట్లాడి పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ చిలుక రవీందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ మినుపాల తిరుపతిరావు, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, సర్పంచులు విద్యాసాగర్‌రెడ్డి, లింగంపల్లి లావణ్య, మాజీ సర్పంచ్‌ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, ఐలయ్య, శేషాద్రి, మచ్చ రమేశ్‌, మావురం మహేశ్‌, సీపెల్లి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.logo