గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 25, 2020 , 03:48:37

‘ఉపాధి’లో కరీంనగర్‌ దేశానికే ఆదర్శం

‘ఉపాధి’లో కరీంనగర్‌ దేశానికే ఆదర్శం

మానకొండూర్‌ రూరల్‌ : జాతీయ ఉపాధిహమీ పథకంలో లక్ష్యాన్ని నాలుగు నెలల్లోనే పూర్తి చేసి కరీంనగర్‌ జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచిందని నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ (ఎన్‌ఎల్‌ఎం) టీమ్‌ సభ్యులు జుబేర్‌, నిజామొద్దీన్‌ కితాబునిచ్చారు. సోమవారం మానకొండూర్‌ మండలంలోని అన్నారం, కొండపల్కల గ్రామాల్లో డీఆర్‌డీఓ వెంకటేశ్వర్‌రావు, ఏపీడీ మంజులాదేవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అన్నారంలో 47 పనులు, కొండపల్కలలో 27 పనులు చేసిన కూలీలతో మాట్లాడి సం తృప్తి వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో ఈ సందర్భంగా బృందం సభ్యులకు వివరించగా, వారు సిబ్బందిని అభినందించారు. రోజు వారీ వేతనం, ఏ సమయంలో డబ్బులను అందిస్తున్నారో ఈజీఎస్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు పనులు కల్పించడంలో భాగంగా జిల్లాలో ఏడాది కోసం నిర్దేశించిన 17,07,458 పనిదినాలకు 19,90,593 చేయడాన్ని అభినందించారు. దేశంలోని తాము ఎంపిక చేసుకున్న 12 జిల్లాల్లో కరీంనగర్‌ ముందున్నదని తెలిపారు. కరోనా సమయంలో నియమ నిబంధనలు పాటిస్తూ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రెండు రోజుల్లో పనిని కల్పించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీఓ భాస్కర్‌రావు, ఎంపీఓ దేవదాస్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బొట్ల కిషన్‌, నల్ల వంశీధర్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితోపాటు పలువురు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo