సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 24, 2020 , 01:39:26

మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

చొప్పదండి: చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు అధునాతన సౌకర్యాలు కల్పించి ఉమ్మడి జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్పష్టం చేశారు. పట్టణంలోని జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. మార్కెట్‌లో మూత్రశాలలు, గోదాం, వేబ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.  రైతుల సౌకర్యార్థం నిర్మించిన వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కార్యాలయంలోని అగ్నిమాపక కేంద్రాన్ని మార్కెట్‌లోకి మార్చినట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.  మార్కెట్‌ కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటూ రైతులకు సేవకులుగా పనిచేయాలని సూచించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ కొత్త గంగారెడ్డిని తూర్పు వాడ రైతు సంఘం అధ్యక్షుడు బొడిగె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రైతు సంఘం, ఉపాధ్యాయ సంఘం సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు కొల్లూరి ఆనందం, బీసవేని రాజశేఖర్‌, పెద్ది లక్ష్మీకాంతం, రాజయ్య, పద్మ, పబ్బ శ్రీనివాస్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు పాషా, టీఆర్‌ఎస్‌ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, వడ్లకొండ శ్రీనివాస్‌, మహేశుని మల్లేశం, మంద నర్సయ్య, స్వామి, ఐలయ్య, పబ్బ సత్యం తదితరులు పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

గంగాధర: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని 35 మంది లబ్ధిదారులకు రూ. 7 లక్షల 50 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జోగు లక్ష్మీరాజం, మాల చంద్రయ్య, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఆకుల అంజయ్య, రామిడి సురేందర్‌, పాశం కుమార్‌, తడిగొప్పుల రమేశ్‌, పంజాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


logo