శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 22, 2020 , 01:37:13

మట్టి గణపతులనే పూజిద్దాం..

మట్టి గణపతులనే పూజిద్దాం..

కరీంనగర్‌ కల్చరల్‌:  జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కనుమల్ల విజయ తన కార్యాలయంలో సిబ్బందికి మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మట్టి గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. అలాగే, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపు మేరకు నగరానికి చెందిన గౌరిశెట్టి మునీందర్‌ 1000 మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అలాగే టవర్‌ సర్కిల్‌లో గణేశ్‌ భక్తమండలి ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిమలను పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌, శ్రీనిధి చిట్స్‌ ఆధ్వర్యంలో లయన్‌ హనుమాండ్ల రాజిరెడ్డి సహకారంతో దాదాపు 1500 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ మంకమ్మతోట ఆధ్వర్యంలో 210 మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇక్కడ గుండోజు లక్ష్మయ్య, పవనసుత రాజు, రాజేశం, గంగాధర్‌, శేఖర్‌ పాల్గొన్నారు. అలాగే గణేశ్‌ భక్త మండలి మహిళా విభాగం అధ్యక్షురాలు నల్ల మంజులత ఆధ్వర్యంలో 48వ డిజిజన్‌ కార్పొరేటర్‌ దుర్శేడ్‌ అనూప్‌కుమార్‌ సహకారంతో వార్డులో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి గణపతులతో పాటు మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. కార్యక్రమంలో మహిళా విభాగం సభ్యులు గందె కల్పన, మానుకోట సునీత, రమ, ఉమ, వనిత, లక్ష్మీరాజం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వాసుదేవ హాస్పిటల్‌, అలయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఇక్కడ అలయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ ఎలగందుల శ్రీనివాస్‌, ఐఎంఏ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు వసంతరావు, డాక్టర్‌ రాంకిరణ్‌, కోల అన్నారెడ్డి, వాసుదేవ దవాఖాన సిబ్బంది ఉన్నారు.

మట్టి గణపతులతో కాలుష్య నియంత్రణ: కలెక్టర్‌

కార్పొరేషన్‌: కాలుష్య నియంత్రణకు మట్టి గణపతులనే పూజించాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. కలెక్టరేట్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఆయన మట్టి గణపతులను కలెక్టరేట్‌ సిబ్బందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటమాధవరావు, కలెక్టర్‌ పరిపాలన అధికారి మాధవి, పౌరసంబంధాల అధికారి శారద, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: ఎంపీ బండి

కార్పొరేషన్‌: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న మట్టి గణపతుల పంపిణీ  భాగంగా ఎంపీ విద్యానగర్‌లో  పాల్గొని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బండ సుమ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 


logo