శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 21, 2020 , 02:14:24

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు నేను సైతం

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు నేను సైతం

  •   ఐదు అంబులెన్సులు సమకూర్చేందుకు ముందుకు..
  • n  మొదటి విడుతగా రూ.43 లక్షల చెక్కు అందించిన మంత్రి గంగుల

కరీంనగర్‌ హెల్త్‌/కార్పొరేషన్‌: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి,  టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన బర్త్‌ డే సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా  మంత్రి గంగుల కమలాకర్‌ ఐదు అంబులెన్సులను సమకూర్చేందుకు ముందుకొచ్చారు. ఇందుకు మొత్తం రూ. 1.1 కోట్లు అవుతుండగా మొదటి విడుతగా రూ.43 లక్షల చెక్కును మంత్రి ఫోర్స్‌ మోటర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధికి అందజేశారు. ఇందులో కరీంనగర్‌ గ్రానైట్‌ అసోసియేషన్‌ రూ. 23 లక్షలు, ఎస్సారార్‌ కన్‌స్ట్రక్షన్‌ రూ. 20 లక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు, కరీంనగర్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీ శంకర్‌, కార్యదర్శి గంగుల ప్రదీప్‌, కోశాధికారి జే అశోక్‌తోపాటు పలువురు  పాల్గొన్నారు.


logo