శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 21, 2020 , 02:14:43

సకల జనుల సంక్షేమమే సర్కారు లక్ష్యం

సకల జనుల సంక్షేమమే సర్కారు లక్ష్యం

  • n  టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు
  • n  168 మంది లబ్ధిదారులకు రూ.1.70 కోట్ల చెక్కుల పంపిణీ

గంభీరావుపేట: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆత్మీయ కానుకగా రూ.లక్షను అందజేస్తున్నారని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. మండలంలోని 168 మంది లబ్ధిదారులకు రూ. 1.70 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం షాదీఖాన భవనంలో పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా అందజేసిన కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  కరోనా బాధితులకు మెరుగైన వైద్యమందించేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం వైర స్‌ బాధితులకు అండగా నిలుస్తుందని చెప్పారు. పౌరులందరూ బాధ్యతగా వ్యవహరించినపుడే వారి ఆరోగ్యానికి భద్రత కలుగుతుందన్నారు. మాస్కులు ధరించడంతో పాటు, నిర్ణీత దూరం పాటించాలని సూచించారు. నిరంతరం సేవలందిస్తున్న వైద్యసిబ్బందిని ఆయన అభినందించారు.  

  చేపల విక్రయ కేంద్రానికి భూమిపూజ 

మండలకేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కె ట్‌ వద్ద రూ.10 లక్షలతో నిర్మించనున్న సామూహిక చేపల విక్రయ కేంద్రానికి రవీందర్‌రావు భూమిపూజచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్యకారులకు మంచి రోజులు వ చ్చాయని చెప్పారు. ఉచిత చేపపిల్లల పంపిణీతో వారి జీవితాల్లో మార్పులు వచ్చాయని పేర్కొన్నా రు. కార్యక్రమాల్లో ఎంపీపీ వంగ కరుణ, సర్పంచ్‌ కటకం శ్రీధర్‌, తహసీల్దార్‌ సుమ, సెస్‌ డైరెక్టర్‌ కొక్కు దేవేందర్‌ యాదవ్‌, వైస్‌ ఎంపీపీ దోసల లత, ఎంపీటీసీ కోటయ్యగారి రాజేందర్‌రెడ్డి, మం డల వైద్యాధికారి వెంకటేశ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అహ్మద్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, గంగపుత్ర సంఘం మండలాధ్యక్షుడు శంకర్‌, ఉపసర్పంచ్‌ నాగరాజుగౌడ్‌, నేతలు సురేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, రాజనర్సు, వహీద్‌, రాజు, శ్రీకాంత్‌రెడ్డి, వేణు, ధర్మపురి ఉన్నారు. 


logo