శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 19, 2020 , 02:43:52

పోరాట యోధుడికి ఘన నివాళి

పోరాట యోధుడికి ఘన నివాళి

కరీంనగర్‌ కల్చలర్‌ : నగరంలో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. మానేరు వంతెనపై ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి మేయర్‌ వై సునీల్‌ రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ  గౌడ్‌, గౌడ సంఘం నాయకుడు కలర్‌ సత్తన్న, తదితరులు పాలాభిషేకం చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సల్ల శారద రవీందర్‌, ఐలేందర్‌యాదవ్‌, భూమా గౌడ్‌, గుగ్గిళ్ల జయశ్రీ, కేడీసీసీబీ డెరెక్టర్‌ సింగిరెడ్డి స్వామిరెడ్డి, అల్గునూర్‌ గౌడ సంఘం అధ్యక్షుడు పడాల రమేశ్‌, నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, మారుతి, గౌడ కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణచౌక్‌: స్థానిక గొల్ల, కుర్మల సంక్షేమ సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు బండి మల్లయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య కుర్మ, నగర అధ్యక్షుడు కొమురయ్యయాదవ్‌, భీమ్‌ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి చంద్రయ్య, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణచౌక్‌: నగరంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో సంఘం సభ్యులు సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్‌, తెలంగాణ గౌడ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు రంగు సంపత్‌గౌడ్‌ హాజరై పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జ్యోతి, రమేశ్‌, శ్రీనివాస్‌, సంజీవ్‌, రాకేశ్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo