శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 19, 2020 , 02:43:53

కరోనా బాధితులకు ఉచిత భోజనం

కరోనా బాధితులకు ఉచిత భోజనం

కరీంనగర్‌ హెల్త్‌: నగరంలో కరోనా బాధితుల ఇండ్లకు ‘మేమున్నాం మీకోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నగునూరి రాజేందర్‌ వెళ్లి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు. మంగళవారం తీగలగుట్టపల్లి, అపోలో దవాఖాన ఎదురుగా,  బుట్టిరాజారాంకాలనీ, ప్రభుత్వ దవాఖాన, శర్మనగర్‌, భగత్‌నగర్‌, సప్తగిరికాలనీ, కోతిరాంపూర్‌, పాతబజార్‌, బోయవాడ, హౌసింగ్‌బోర్డుకాలనీ, విద్యానగర్‌, తదితర ప్రాంతాల్లో కరోనా బాధితుల ఇండ్లకు వెళ్లి భోజనం అందజేశారు. భోజనం అవసరమున్న వారు సెల్‌ నంబరు 9000454141లో సంప్రదించాలని కోరారు.


logo