బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 19, 2020 , 02:43:56

ఆడబిడ్డలకు సర్కారు అండ

ఆడబిడ్డలకు సర్కారు అండ

  • ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ 
  • కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

చొప్పదండి: ఆడబిడ్డల పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఆర్థిక సాయం చేస్తూ అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. చొప్పదండిలోని క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.  ఈసందర్భంగా మాట్లాడుతూ  ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం తమదని, ఆ దిశగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల పెళ్లి చేసిన తల్లిదండ్రులు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కల్యాణలక్ష్మి ద్వారా వచ్చిన ఆర్థిక సాయం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి,  సర్పంచ్‌ శంకర్‌, కౌన్సిలర్‌ గంగరాజు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు మంద నర్సయ్య, చేపూరి రవీందర్‌, మావురం మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉండాలి 

గంగాధర: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆదేశించారు. మండలంలోని గోపాల్‌రావుపల్లి గ్రామానికి  చెందిన నాగారపు భూలక్ష్మికి చెందిన ఇల్లు వర్షానికి కూలిపోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయంగా రూ. 3 వేలు అందజేశారు. అనంతరం గోపాల్‌రావుపల్లి మాజీ సర్పంచ్‌ నాగారపు సత్యనారాయణ ప్రమాదంలో గాయపడి కాలు విరుగగా ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ వేముల భాస్కర్‌, సర్పంచ్‌ రాసూరి మల్లేశం, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్‌, ఏఎంసీ డైరెక్టర్‌ పెంచాల చందు తదితరులున్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత 

రామడుగు: మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ. లక్షా 69 వేల విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నదన్నారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. 


logo