ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 16, 2020 , 01:53:56

తెలంగాణ పాలన దేశానికి ఆదర్శం

తెలంగాణ పాలన దేశానికి ఆదర్శం

  • n జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌
  • n మహనీయులకు ఘనంగా నివాళి
  • పెద్దపల్లిటౌన్‌: తెలంగాణ ప్రభుత్వ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు.  జిల్లా కేంద్రంలోని జడ్పీ, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఆయన జెండా ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పెద్దపల్లిలోని జెండా చౌరస్తా, కూరగాయల మార్కెట్‌లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతారెడ్డి జెండా ఎగురవేశారు. ఆయా కార్యాలయాల్లో ఆర్డీవో శంకర్‌కుమార్‌, డీసీపీ రవీందర్‌, సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐ రాజేశ్‌, సుభాష్‌నగర్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొంరయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నజ్మీనా సుల్తానా మొబీన్‌, కౌన్సిలర్లు పైడ పద్మ, రవి, పూదరి చంద్రశేఖర్‌, గందె మాధవి, లశెట్టి భిక్షపతి, చందా రమాదేవి, రెవె ల్లి స్వామి, నాయకులు అస్రఫ్‌, ఇన్‌చార్జి మేనేజర్‌ భాస్కర్‌, ఆర్‌ఐ శివ ప్రసాద్‌, శానిటేషన్‌ సూపర్‌వైజర్లు రాంమోహన్‌రెడ్డి, పులిపాక రాజు, నవీన్‌, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ మందల వాసుదేవారెడ్డి, వైద్యులు రమాకాంత్‌, కుమారస్వామి, శ్రీనిధి, శ్రీవాణి తదితరులున్నారు.

మహనీయుల త్యాగాలతోనే..

పెద్దపల్లి కల్చరల్‌: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీర్‌సింగ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంచి పెట్టా రు. కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, గ్రంథాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ ఎండీ. గఫార్‌, సిబ్బంది సీహెచ్‌. రమేశ్‌, ప్రేమ్‌కుమార్‌, పాఠకులు రమేశ్‌, మల్లేశ్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. డీఈవో కార్యాలయంలో డీఈవో జగన్‌మో హన్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. జిల్లా మత్య్సశాఖాధికారి కార్యాలయంలో డీఎఫ్‌వో మల్లేశం, జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయ ఆవరణలో జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేశం జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంచి వేడుకలను నిర్వహించారు. పెద్దపల్లిలోని 13వ వార్డులో నల్లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. నల్లా ఫౌండేషన్‌ సభ్యుడు భీమోజు సురేందర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంచా రు. ఇక్కడ షకీల్‌, అలువోజు రవితేజ, కలీమ్‌, వసీమ్‌ బేగ్‌, ఎండీ షార్‌, ఇమ్రాన్‌, లక్ష్మణ్‌, రహెమాన్‌, నిజామొద్దీన్‌ ఉన్నారు. 

పెద్దపల్లి జంక్షన్‌: జిల్లా రవాణా కార్యాలయంలో ఆర్టీవో ఆఫ్రిన్‌ సిద్దికి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


logo