శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 14, 2020 , 03:17:15

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

చొప్పదండి: రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలోని జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు.  ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అన్నదాతల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. పది వేలు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు బీమా, రైతు వేదికలు, కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మండలంలోని గుమ్లాపూర్‌, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, మంగళపల్లి గ్రామాల్లో నీటి సమస్య ఉందని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి నెల రోజుల్లో పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ కొత్త గంగారెడ్డి, డైరెక్టర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.logo