గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 14, 2020 , 03:17:42

అభివృద్ధి చేసి చూపిస్తాం

అభివృద్ధి చేసి చూపిస్తాం

కార్పొరేషన్‌: ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచి గెలిపించారని, వారి కోరిక మేరకు అభివృద్ధి చేసి చూపించి రుణం తీర్చుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నా రు. స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం జరిగిన కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశాల మేరకు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నామని తె లిపారు. ప్రభుత్వం, పార్టీ సమాంతరంగా నడిచి నప్పుడే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అభివృద్ది జరు గుతుందని సీఎం కేసీఆర్‌ చెబుతారని గుర్తుచేశా రు. పార్టీ పరంగా ముందుకు సాగాలని, నాయకు లంతా పార్టీ కోసం పని చేస్తే ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించే అవకాశం ఉందన్నారు. కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల్లో పార్టీ సూచించిన మేరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, మిత్రపక్షం ఎంఐఎం అభ్య ర్థులను ఏ కగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఈ ఎన్నికలు పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. పార్టీ సూచన మేరకు అభ్యర్థులు గెలిపించినందు కు పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఇప్పటికే న గరంలో ఐటీ టవర్‌, మానేరు రివర్‌ ఫ్రంట్‌ను ప్రా రంభించామని, కేబుల్‌ బ్రిడ్జి కూడా పూర్తి కావస్తు న్నదని, ఇతర అభివృద్ది పనులు వేగంగా సాగు తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నా రు. అభ్యున్నతిలోకి తీసుకువస్తామన్నారు. ఈ కా ర్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ స్వరూపరాణి హరిశంకర్‌ పాల్గొన్నారు. 


logo