శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 12, 2020 , 02:57:23

నిరాడంబరంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నిరాడంబరంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

కరీంనగర్‌ కల్చరల్‌ : కరోనా నేపథ్యంలో నగరంలో మంగళవారం  కృష్ణాష్టమి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అశోక్‌నగర్‌లోని మళయాల సద్గురు గీతామందిరంలో గల సన్మాన మఠంలో ముఠాధిపతి విష్ణుసేవానందగిరి స్వామి పర్యవేక్షణలో విష్ణుమూర్తి శర్మ, చంద్రమౌళి శర్మ, రంజిత్‌కుమార్‌ శర్మ, సోమేశ్వర శర్మ అభిషేకాలు, అర్చనలు, మూలమంత్ర హోమం, సాయంత్రం పారాయణం, రాత్రి 12 గంటలకు డోలోత్సవం నిర్వహించారు. సాయినగర్‌లోని మురళీకృష్ణాలయంలో జరిగే వేడుకలను వాయిదా వేశారు. అర్చకుడు  రాజు శర్మ శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. కోతిరాంపూర్‌లోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో అర్చకుడు రామక శంకర శర్మ పూజలు చేయగా, కమాన్‌రోడ్డులోని రామేశ్వరాలయంలో అర్చకుడు రఘురామ శర్మ శివుడికి శ్రీకృష్ణుడి అలంకరణ చేశారు.  భక్తులు తక్కువ సంఖ్యలో వెళ్లగా, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ పూజలు చేశారు. అలాగే, గోకుల యాదవ సంక్షేమ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు దుండ్ర రాజన్న యాదవ్‌, బూస అంజన్న యాదవ్‌, బుచ్చన్న యాదవ్‌, చెర్ల పద్మ యాదవ్‌, రవీందర్‌ యాదవ్‌, కాల్వ మల్లేశ్‌ యాదవ్‌, రాజేందర్‌ యాదవ్‌, మల్లయ్య యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.  కాగా, ఈసారి ఎక్కడా ఉట్టి కార్యక్రమం చేపట్టలేదు.   logo