ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 12, 2020 , 02:57:31

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

  •  n మేయర్‌ వై సునీల్‌రావు
  •  n 23వ డివిజన్‌లో మొక్కల పంపిణీ

కార్పొరేషన్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మేయర్‌ వై సునీల్‌రావు పిలుపు నిచ్చారు. నగరంలోని 23వ డివిజన్‌ (ఆదర్శనగర్‌)లో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్‌ కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం అభయాంజనేయస్వామి ఆలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కో మొక్క నాటాలన్నారు. పర్యావరణం బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. హరితహారంలో భాగంగా నగరంలో ఈసారి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని, మియావాకి పద్ధతి, బ్లాక్‌ ప్లాంటేషన్‌ కూడా వేగంగా చేపడుతున్నామన్నారు. హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

విద్యార్థుల ఆరోగ్య రక్షణకు చర్యలు 

కార్పొరేషన్‌: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ కల్పించేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. వచ్చే నెల నుంచి సర్కారు పాఠశాలలను ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తామని తెలిపారు. 23వ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య పనుల కోసం అట్లాంట తెలంగాణ సొసైటీ అమెరికా సంస్థ దాతల సహకారంతో కొనుగోలు చేసిన శానిటైజేషన్‌ కిట్లను మేయర్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను కొలిచే థర్మా మీటర్‌, పాఠశాల పరిసరాలను శానిటైజేషన్‌ చేసేందుకు వినియోగించే పవర్‌ స్ప్రే, హ్యాండ్‌ స్ప్రే యంత్రాలు ఉన్నట్లు తెలిపారు. దాతల సహకారంతో నగరంలోని అన్ని పాఠశాలలకు ఈ కిట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శానిటైజేషన్‌ కిట్లు అందించేందుకు అమెరికా తెలంగాణ సొసైటీ వారు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో  కార్పొరేటర్‌ అర్ష కిరణ్మయి, దాతలు నీలగిరి మహేశ్‌, నీలగిరి అనిల్‌, బోయినపల్లి ప్రభాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు. logo