మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 11, 2020 , 00:37:09

అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించాలి

అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించాలి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: నగరంలో అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించడంతోపాటు హరితహారం, పబ్లిక్‌ టాయిలెట్స్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, మెప్మా పీడీ రవీందర్‌తో కలిసి వీధి వ్యాపారుల గుర్తింపు, హరితహారం, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించాలని సూచించారు. తదుపరి నిర్వహించే సమావేశం వరకు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులను గుర్తించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వయంగా ప్రతి మున్సిపాలిటీలో తిరిగి పర్యవేక్షిస్తానని, అర్హుల జాబితా తయారు చేయడంలో ఎలాంటి పొరపాటు జరిగినా సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. హరితహారంలో అవెన్యూ, బ్లాక్‌ ప్లాంటేషన్‌, మియావాకి, మంకీఫుడ్‌ కోర్టు పనులు ఆగస్టులోగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో చింతవనాలు ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాలను ఈనెల 15లోగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. logo